BTU OF ANANTAVARAM SVT FROM FEB 28 TO MARCH 3_ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 12 February 2018: The Annual Brahmosavam of TTD sub temples, Sri Venkateswara Temple at Anantavaram, Tullur Mandal of Guntur district will commence from Feb 28-March 3. As part of the event Koil Alwar Thirumanjanam will be performed on Feb 20, Ankurarpanam will be held at 6pm of February 27.
The celestial event will commence from Dwajarohanam on Feb 28 at 9am of Meena lagnam and Aswa Vahanam in evening. On March 1 Shanti Kalyana mahotsavam will be performed and Chakrasnanam will be held on March 2, Garuda Vahanam at night same day and finally Dwajaavarohanam at night.
Similarly Pushpa Yagam will be held every evening during the Brahmotsavam, Snapana Tirumanjanams for utsava idols, and unjal seva in the evening. The cultural wings of TTD like HDPP, Annamacharya project will conduct cultural, devotional programs ever day.
On March 18 on ocassion of Ugadi, Abhisekham, Panchanga Sravanam and Asthanam programs will be conducted.
Phalguna month festivities will commence in temple from February 17, 24, March 3, 10, and 17 on all five Saturdays.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 12, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 3వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 9 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 1న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు. మార్చి 2వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా మార్చి 3న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజలసేవ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మార్చి 18వ తేదీన ఉగాది సందర్భంగా ఉదయం 4 నుంచి 5 గంటల వరకు అభిషేకం, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 17 నుంచి ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు :
ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24, మార్చి 3, మార్చి 10, మార్చి 17వ తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Nice
ReplyDelete