AGED PEOPLE DARSHAN ON FEB 13 AND 20_ ఫిబ్రవరి 13, 20వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, ఫిబ్రవరి 14, 21వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
Tirumala, 11 February 2018: The darshan for aged people and physically challenged in the month of February had been fixed on 13 and 20 where 4000 tickets will be issued in three slots.
While for parents with children below 5years kids will be allowed on February 14 and 21.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 13, 20వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, ఫిబ్రవరి 14, 21వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
ఫిబ్రవరి 11, తిరుపతి, 2018: ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను
కల్పిస్తోంది.
కల్పిస్తోంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 13, 20వ తేదీల్లో వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఫిబ్రవరి 14, 21వ తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
0 comments:
Post a Comment