KOIL ALWAR TIRUMANJANAM AT SRI KVS TEMPLE ON FEB 1
Tirupati, 30 January 2018: In view of the Annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy Temple from Feb 6-14 at Srinivasa Mangapurm Koil Alwar Tirumanjanam ritual will be performed on February 1.
All arjita sevas -Thiruppavadai, Kalyanotsavams etc. were cancelled in view of the same.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఫిబ్రవరి 1న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2018 జనవరి 30: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 1న గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 11.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడ, కళ్యాణోత్సవంలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
0 comments:
Post a Comment