ALL SET FOR SRI RAMAKRISHNA THEERTHA MUKKOTI_ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
Tirumala, 30 January 2018: TTD has made all arrangements for the Sri Ramakrishna theertha Mukkoti festival performed every year on the Pushya star on pournami day at the Sri Ramakrishna thirta located 6 kms from Srivari temple.
Priests from the Srivari Temple perform special rituals at the Thirtham to the idols of Sri Rama and Sri Krishna. TTD has organised disbursement of Anna prasadam packets –pongal, upma, sambar rice, curd rice and puliharam and drinking water for devotees that gather at the theertham for th ritual.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
తిరుమల, 2018 జనవరి 30: తిరుమలలో బుధవారం జరుగనున్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతిఏటా మకరమాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో ఉన్న ఈ తీర్థంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయం నుంచి వైదికులు మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో సృష్టించినట్టుగా పేరొందిన ఈ పుణ్యతీర్థంలో ఆర్చక స్వాములు, ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తీర్థం ఒడ్డున కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్య సమర్పణ గావిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
0 comments:
Post a Comment